Samsung: చైనాకు షాక్ ఇచ్చిన శాంసంగ్ సంస్థ, ఫ్యాక్టరీ నోయిడాకు తరలింపు

Samsung: చైనాకు మరో భారీ షాక్ తగిలింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజమైన శాంసంగ్ సంస్థ ఇచ్చిన షాక్ ఇది. శాంసంగ్ ఫ్యాక్టరీను చైనాలో కాకుండా ఇండియాలో ఏర్బాటు చేయబోతోంది. ఇండియాను ఎంచుకోడానికి కారణమేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2021, 10:39 PM IST
Samsung: చైనాకు షాక్ ఇచ్చిన శాంసంగ్ సంస్థ, ఫ్యాక్టరీ నోయిడాకు తరలింపు

Samsung: చైనాకు మరో భారీ షాక్ తగిలింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజమైన శాంసంగ్ సంస్థ ఇచ్చిన షాక్ ఇది. శాంసంగ్ ఫ్యాక్టరీను చైనాలో కాకుండా ఇండియాలో ఏర్బాటు చేయబోతోంది. ఇండియాను ఎంచుకోడానికి కారణమేంటి..

ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ (Samsung) చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాను కాదని మరీ ఇండియాను ఎంచుకుంది. అది కూడా ఆ దేశంలో నిర్మించ తలపెట్టిన కంపెనీను ఇండియాకు తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. చైనా(China)లో శాంసంగ్ సంస్థ డిస్ ప్లే తయారీ యూనిట్ ను నిర్మించ తలపెట్టింది.మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాల కారణంగా చైనాలో ఉన్న డిస్ ప్లే తయారీ యూనిట్‌ను అక్కడ్నించి ఇండియాలోని  నోయిడాకు తరలించనుంది. శాంసంగ్ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈవో కెన్‌కాంగ్ నేతృత్వంలో టీమ్ యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిసింది.

ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) రాష్ట్రాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని శాంసంగ్ ప్రతినిధి బృందం తెలిపింది. శాంసంగ్ సంస్థ నోయిడాలో నిర్మించ తలపెట్టిన కర్మాగారం..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమైందనేందుకు ఓ ఉదాహరణ అని యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) తెలిపారు. 

Also read: BSNL Recharge Plan: జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్, 105GB అధికం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News